Header Banner

ఏపీపై కేంద్రం నివేదిక! ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’లో అగ్రగామిగా ఆ స్థానం!

  Sun Apr 06, 2025 13:10        Politics

కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం, ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం 8.21 శాతం వృద్ధిరేటుతో దేశంలో రెండవ స్థానంలో నిలిచింది. తమిళనాడు 9.69 శాతం వృద్ధిరేటుతో అగ్రస్థానంలో ఉంది. ఏపీలో మాన్యుఫ్యాక్చరింగ్, సర్వీస్, వ్యవసాయ రంగాల్లో గణనీయమైన అభివృద్ధి నమోదు కావడం ఈ వృద్ధికి కారణంగా పేర్కొంది. ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’లో అగ్రస్థానంలో ఉండడం, పారదర్శక పరిపాలన, పారిశ్రామిక విధానాలు పెట్టుబడులకు అనుకూల వాతావరణం కల్పించడంలో కీలకంగా నిలిచాయి. బిజినెస్ రిఫార్మ్స్ యాక్షన్ ప్లాన్ అమలులో ఏపీకి ప్రత్యేక గుర్తింపు లభించింది.

 

ఇది కూడా చదవండి: విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఏపీలోని సర్కారు బడుల్లో కోడింగ్‌ పాఠాలు.! ఈ మూడు జిల్లాల్లో 248 మందికిపైగా..

 

2024లో చంద్రబాబు నాయుడు నాలుగవసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత, ఆర్థిక రంగంపై దృష్టి సారించి, రాష్ట్రాన్ని ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంపై గట్టి చర్యలు తీసుకున్నారు. టీడీపీ-జనసేన-బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంస్కరణలు వృద్ధికి దోహదమవుతున్నాయి. కొత్తగా తీసుకొచ్చిన మూడు పారిశ్రామిక విధానాల వల్ల పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు పెరిగాయి. గత 10 నెలల్లో ఏపీ రాష్ట్రానికి 8 లక్షల కోట్ల పెట్టుబడులు, 5 లక్షల ఉద్యోగాల కల్పన వంటి అభివృద్ధి చర్యలు ఈ మార్పుకు నిదర్శనంగా నిలిచాయి. ఇవన్నీ ఏపీని దేశ ఆర్థిక వృద్ధికి గ్రోత్ ఇంజిన్‌గా మారుస్తున్నాయి.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

మహిళల ఖాతాల్లో నెలకు ₹2,500 ! అది చేస్తేనే డబ్బు వస్తుందట! నిజమేనా ఇది?

 

రేషన్ కార్డు దారులకు బిగ్ అలర్ట్.. e-KYC ప్రక్రియకు గడువు పొడిగింపు - ఇది చేసిన వారికే.! కేంద్రం కీలక నిర్ణయం..

 

కీలక దశకు పాస్టర్ ప్రవీణ్ మృతి.. మాజీ ఎంపీపై కేసు న‌మోదు! వైసీపీ గుండెల్లో గుబులు..

 

సెల్ఫీ వీడియోతో కలకలం! ఎస్ఐ వేధింపులతో ఆత్మహత్యాయత్నం!

 

ఆ రూట్ ని మోడరన్ రహదారిగా.. సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్! నాలుగు లైన్ల రహదారి రూపంలో..!

 

ఏపీలో మెడిసిన్ మేకింగ్ హబ్.. భారీ పెట్టుబడులతో మెగా ప్రాజెక్ట్! 7,500 మందికి ఉపాధి కల్పన!

 

అమెరికాను వీడొద్దు వెళ్తే రాలేరు.. హెచ్‌1బీ వీసాదారులకు - టెక్‌ దిగ్గజాల అలర్ట్‌! ఉద్యోగుల గుండెల్లో గుబులు..

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #AndhraPradesh #APDevelopment #APGrowthEngine #EconomicGrowth #VibrantAndhra #RisingAndhra #InvestInAP